Sannihitha

Monday, September 28, 2009

విజయదశమి శుభాకాంక్షలు


విజయదశమి శుభాకాంక్షలు

Friday, September 25, 2009

పరిచయం :

శుభోదయం ..!'సన్నిహిత' అనే ఈ నూతన బ్లాగులోకి అందరికీ
స్వాగతం.ఈ బ్లాగులో మీకు సాహిత్య అంశాలు,ఆధ్యాత్మిక అంశాలు,ఆరోగ్య
 అంశాలు,ఆరోగ్య సలహాలు,ముఖ్యంగా కిడ్నీ వ్యాధులకు సంబంధించిన
సమాచారం,సలహాలు ఉంటాయి.మీమీ జీవిత సమస్యలు మాతో పంచుకుంటే
తగిన సలహాలు,సూచనలు దొరుకుతాయి.
    

ప్రాణాయామ - యోగ:

                            అనేక వొత్తిళ్ళతో నిండి ఉన్న మన జీవితాలలో శారీరక మానసిక
ఆరోగ్యాన్ని చేకూర్చే చక్కని ఔషధం యోగా.పతంజలి యోగశాస్త్రం ఆధారంగా అనేక సంస్థల
వారు రకరకాల యోగాసనాలను నేర్పిస్తున్నారు.మన హడావిడి జీవితాలలో కొంత
సమయాన్ని మన కోసం కేటాఇంచుకోకపోతే కొంత కాలానికి మనకు మనమే మిగలం.
కాబట్టి రోజువారీ జీవితాలలో అనేక రకాల యోగాసనాలు వేయలేకపోయిన,అన్నిటి
ఫలితాలను అందించే సూర్యనమస్కారాలను చేసుకుంటే సరిపోతుంది.అవి ఎలా చేయాలో
తరువాత విఫులంగా తెలుకుందాం.
     

మానసిక సమస్యలు:

                              మానసిక సమస్యలకు ముఖ్య కారణము మానసిక ఆందోళన.
ఆందోళనకు కారణము సమస్య ఉత్ప్తన్నం కావటం."సమస్య అంటే మనకి నచ్చని పరిణామాలు
కలగటం". నచ్చని పరిస్థితులను మనకి అనుకూలం గా మార్చుకోవాలి లేదా మనమే వాటికీ
అనుకూలంగా మారాలి. అంతే తప్ప పరిస్థితికి వ్యతిరేక దిశలో పోరాడితే మానసిక అశాంతే 
మిగులుతుంది. కాబట్టి నిరంతర మార్పుకి సిధ్ధంగా ఉండండి.మార్పుని ఆహ్వానించండి. 

కిడ్నీ సమస్యలు:

మీకుతెలుసా?
              మానవ శరీరంలో అత్యంత ముఖ్యమైన భాగం మూత్రపిండాలు.ఇవి
అత్యంత సున్నితమైనవే కాదు అత్యంత మొండివి కూడా.ఇది మనం తీసుకునే
ఆహరం లోని వ్యర్ధ పదార్ధాలను వడ కడతాయని మనకు తెలుసు కదా.కానీ ఆ
పనిని అవి చెయ్యలేక పోతే...జీవితం దుర్భరం...దుస్సహం...నిరంతరం ప్రత్యక్ష
నరకం.ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా వ్యాపిస్తున్న సమస్య కిడ్నీ సమస్య.దేనికి
తగిన కారణాలు ఏమిటో ఇప్పటికి తేలలేదు.ముఖ్యంగా ఈ వ్యాధి ఆంద్రప్రదేశ్ లోని
"శ్రీకాకుళం జిల్లా - ఉద్దానం" లో ఎక్కువగా నమోదైంది.అక్కడ ఇంటికి కనీసం ఒకరు
ఈ వ్యాధి తో భాధ పడుతున్నారంటే అతిశయోక్తి కాదు.ఒక్క శ్రీకాకుళం లోనే కాదు
నేడు ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్న ప్రాణాంతక వ్యాధులలో కిడ్నీ సమస్యదే అగ్రస్థానం.

జాగ్రత్తలు:
              పరిశుభ్రమైన నీటిని ఎక్కువగా తేసుకోవటం. బి.పీ ని  తరచుగా
పరిక్షించుకోవటం. బి.పీ ఎక్కువగా ఉన్నా,ఆకలి మందగించి, అకారణంగా
బరువు తగ్గినా,ఆగకుండా దగ్గు వచ్చినా వెంటనే రక్తపరీక్ష చేఇంచుకుంటే మంచిది.

ఆరోగ్యం:

              ఆరోగ్యమే మహా భాగ్యమని పెద్దలు అన్నారు కదా! దాన్ని కాపాడుకోవాలంటే
చిన్న చిట్కా. వీలైనంత ఎక్కువగా మంచి నీరు తాగండి. ఈ నీటిని కూడా క్రమబద్ధంగా
తీసుకోవాలి.ఉదయాన్నే పరగడుపున పెద్దలు ఒకటి నుండీ రెండు లీటర్లు నీటిని, పిల్లలు
అరలీటరు నుండీ ఒక లీటరు నీటిని తీసుకోవాలి.ఇది మలబద్ధకాన్ని  కూడా దూరం చేస్తుంది.
రోజులో వీలైనంత ఎక్కువ నీటిని (సుమారు ఇదు లీటర్లు) తీసుకోవాలి.ఈ నీటిని ఏదైనా
ఆహారాన్ని తీసుకోవడానికి గంట ముందు గంట తర్వాత మాత్రమే తేసులోవాలి.    

ప్రస్తుతం ప్రజలని వణికిస్తున్న స్వైన్-ఫ్లూ  జ్వరానికి వాడవలసిన
హోమియో మందులు:   ఇంఫ్లుఎంజియం-200,జేలేసీనియం-200
వాడుక విధానము: వారంలో ఒక రోజు ఒక రకం మందను ఒక డోస్ తీసుకున్న తరువాత
ఒక రోజు ఆగి మరొక మందును ఒక డోస్ తీసుకోవాలి.ఇదే విధముగా 
తరువాత వారము కూడా వాడవలయును.
తీసుకోవలసిన జాగ్రతలు:
  • డెట్టాల్ తో శుభ్రం చేసిన కర్చీఫ్ ను ముక్కుకు కట్టుకోవాలి.
  • యుకలిప్టుస్ ఒఇల్లో ముంచిన దూదిని తరచుగా వాసనా చూస్తూ ఉండాలి.

ఆధ్యాత్మికం:

శ్రీ గురుభ్యోనమః
 జీవాత్మస్వరుపులారా!
                                  ఏ విషయాన్నైనా తెలుసుకోవాలంటే ముందుగా మనం
మానసికంగా సిద్ధపడి వుండాలి.నిరంతరం నూతన జ్ఞ్ఞానాన్ని పొందాలంటే మన మనస్సుని
ఖాళీ కప్పులా వుంచుకోవాలి అంటారు స్వామి నిత్యానంద. ఎందుకంటే అప్పటికే నిండివున్న
కప్పులో మనం కొత్తగా ఏమీ నింపలేముకదా.నింపాలని ప్రయత్నించినా అవి వృధానే
అవుతాయి.కాబట్టి ఒక గురువు దగ్గరకు వెళ్ళేడప్పుడు మన అనుమానాలన్నిటినీ గది
బయట చెప్పులతోపాటే విడిచిపెట్టాలి.      


సాహిత్యం:


మోరీ తో మంగళ వారాలు:   
                             మనిషి ఎలా జీవిస్తే బాగుంటుందో చాలా మంది చెప్పారు.
కానీ ఎలా మరణిస్తే బాగుంటుందో మాత్రం మోరీనే చెబుతారు.అర్ధవంతంగా జీవించటం
ఎలా? ఆదర్శవంతంగా బ్రతకడం ఎలా? డబ్బు సంపాదించటం ఎలా? జీవితం లో గెలవటం
ఎలా? మొ..  అంశాలపై మనకు అన్ని భాషల్లోనూ ఎంతో సాహిత్యం ఉంది.కానీ మరణం
విషయం ముందే తెలిసినా దానిని ధైర్యంగా ఎదుర్కోవడం ఎలా? ఆ మరణాన్ని మన
జీవితం లోకి ఆనందంగా ఆహ్వానించటం ఎలా? అనే అంశాల తో ఆంగ్లం లో వెలువడిన
పుస్తకం 'మిచ్ ఆల్బం' రాసిన "My Tuesdays with Morie"
                           తన చివరి దినాలలో సైతం మరణ శయ్య మీద ఉంటూనే కొత్త 
మిత్రులను సంపాదించుకుని వారితో తన మనోభావాలను పంచుకుంటూ, బ్రతికి 
ఉండగానే తన నమూనా అంత్య క్రియలు,సంతాప సభజరిపించుకుని మురిసిపోయిన 
మోర్గాన్ చెబుతాడు.
                చనిపోయే నిమిషం వరకు పనిని ప్రేమిస్తూ,పని చేస్తూనే ఉండాలనే మోర్గాన్
ఆదర్శాన్ని మనకు తెలుగులో అందంగా అందించారు ప్రొఫెసర్ "అత్తలూరి నరసింహా రావు"
గారు. ఇది అలకనందా ప్రచురణలు ద్వారా ముద్రించబడింది.